ETV Bharat / bharat

'కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక అప్పుడే'

కాంగ్రెస్​ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మొదలైందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ వెల్లడించారు. 6 నెలల్లోపు పార్టీకి కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరిస్తారని ఈటీవీ భారత్​తో తెలిపారు.

anwar
అన్వర్
author img

By

Published : Sep 25, 2020, 7:57 AM IST

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గత నెలలో సీనియర్ నేతలు రాసిన లేఖ విషయంలో పరిష్కారం కుదిరిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ వెల్లడించారు. ఇటీవల జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏఐసీసీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే విషయమై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన అన్వర్​.. పార్టీ విషయాలపై చర్చించారు. లేఖ రాసిన సీనియర్ నేతలు పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన వర్కింగ్ కమిటీలోనూ ఈ నేతలు ఉన్నారని గుర్తు చేశారు. ఇందులో ఎలాంటి ఊహాగానాలు, వదంతులకు తావులేదని స్పష్టంచేశారు.

"మరో 6 నెలల లోపు ఏఐసీసీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆరోగ్య కారణాల రీత్యా సోనియా ఈ బాధ్యతలను నిర్వహించేందుకు సుముఖంగా లేరు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ ఈ పదవికి రాజీనామా చేశారు. మరో వ్యక్తి బాధ్యతలు స్వీకరిస్తారని హామీ ఇచ్చారు. ఇప్పటికే కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మొదలైంది."

- తారిక్ అన్వర్​, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి: మారని హస్తరేఖలు.. కుటుంబ పరిధి దాటని కాంగ్రెస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.