అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో దిల్లీకి చెందిన రక్షణ రంగ మధ్యవర్తి సుషేన్ మోహన్ గుప్తాను నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు ఈడీకి అనుమతిచ్చిందిదిల్లీ కోర్టు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం సుషేన్ను ఆరెస్టు చేసింది.
రూ.3,600 కోట్ల విలువైన వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించి కొంత కాలం క్రితం న్యాయవాది గౌతమ్ ఖైతన్, బ్రిటన్‌కు చెందిన మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్లను ఈడీ ఆరెస్టు చేసింది.
రాజీవ్ సక్సేనా ఆధారాలే కీలకం
అగస్టా కేసు నిందితుల్లో ఒకరైన రాజీవ్ సక్సేనాను... యూఏఈ నుంచి భారత్‌కు వచ్చినప్పుడు ఈడీ అరెస్టు చేసింది. ఆయన అప్రూవర్‌గా మారాడు. ఆయన ఇచ్చిన ఆధారాల మేరకు సుషేన్ను ఆరెస్టు చేసింది ఈడీ.
గుప్తా వద్ద సమాచారం?
హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల గురించి గుప్తా వద్ద సమాచారం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.