ETV Bharat / bharat

'ప్రత్యేక అధికారాల చట్టం' పాక్షిక సడలింపు - భద్రతాదళాలు

వివాదాస్పద సాయుధ దళాల(ప్రత్యేక అధికారాల) చట్టాన్ని అరుణాచల్ ప్రదేశ్​లోని మూడు జిల్లాల్లో పాక్షికంగా సడలిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. మిగతా కల్లోలిత ప్రాంతాల్లో మరో 6 నెలలు పాటు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

అరుణాచల్​ప్రదేశ్​లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం పాక్షిక ఉపసంహరణ
author img

By

Published : Apr 2, 2019, 7:36 PM IST

అరుణాచల్​ప్రదేశ్​లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం పాక్షిక సడలింపు

అరుణాచల్​ప్రదేశ్​లో 32 సంవత్సరాల తరువాత భద్రతాదళాలకు స్వీయ అధికారాలు కల్పించే వివాదాస్పద 'సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని' పాక్షికంగా సడలించింది కేంద్రం. అరుణాచల్​ ప్రదేశ్​లో మొత్తం 9 జిల్లాలున్నాయి. వీటిలో 3 జిల్లాల్లో మాత్రమే ఈ చట్టం పాక్షికంగా సడలించారు. మయన్మార్​ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా అమలుకానుంది.

జస్టిస్​ బీపీ జీవన్​రెడ్డి కమిటీ అరుణాచల్​ ప్రదేశ్​లో 'సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం' రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో అరుణాచల్​ ప్రదేశ్​లోని నాలుగు పోలీసు స్టేషన్ల పరిధిలోని 'కల్లోలిత ప్రాంతాల్లో' (ఈ పదం హోంశాఖ తొలగించింది) ఆదివారం నుంచి సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం అమలు నిలిపివేస్తున్నట్లు హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది.

ఇకపై స్వేచ్ఛ లభించేనా..

ఇకపై పశ్చిమ కెమాంగ్​ జిల్లాలోని బలేము, బలుక్పాంగ్​, తూర్పు కెమాంగ్​ జిల్లాలోని సెయిజోసా, పపుంపరే జిల్లాలోని బలిజాన్​ పోలీసు స్టేషన్​ పరిధిలో ఈ చట్టం అమలు కాదు.
మరి కొంతకాలం వేచిచూడక తప్పదు

అరుణాచల్​ ప్రదేశ్​లోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో ఎన్ఎస్​సీఎన్​, ఉల్ఫా, ఎన్​డీఎఫ్​బీ లాంటి నిషేధిత తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో ఈ చట్టం అమలు కొనసాగించాలని హోంమంత్రిత్వశాఖ నిర్ణయించింది.

తిరప్​, చాంగ్​లాంగ్​, లాంగ్​డింగ్​ జిల్లాలు, నామ్​సాయ్​ జిల్లాలోని మహదేవ్​పూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో, దిగువ దిబాంగ్​ లోయ జిల్లాలోని రోయింగ్​, లోహిత్ జిల్లాలోని సన్​పురాలో మరో ఆరు నెలల (సెప్టెంబర్​ 30) వరకు ఈ చట్టం అమలు కానుంది.

ఇదీ నేపథ్యం..

పార్లమెంటు​ 1958లో ఈ 'సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం' రూపొందించింది. ఈ చట్టం ప్రకారం సాయుధ దళాలు ఎవరినైనా నిర్బంధించవచ్చు. ఏ ప్రదేశంలోనైనా తనిఖీ చేపట్టవచ్చు. చట్టాన్ని కేంద్రం గానీ, రాష్ట్రాలు గానీ అమలు చేయవచ్చు.

ఈ చట్టాన్ని అసోం, కేంద్రపాలిత ప్రాంతం మణిపూర్​లలో అమలుచేశారు. 1987 ఫిబ్రవరి 20న అవతరించిన అరుణాచల్ ప్రదేశ్​ దీనిని వారసత్వంగా పొందింది. తదనంతర కాలంలో మేఘాలయ, మిజోరం, నాగాలాండ్​లకూ ఈ చట్టం వర్తింపజేశారు.

గతేడాది మార్చిలో భద్రతా పరిస్థితిలో మెరుగుదల కారణంగా మేఘాలయలో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం అమలును పూర్తిగా తొలగించారు.

ఇదీ చూడండి:కశ్మీర్​: ముష్కరుల పాపం... ఉపాధికి శాపం

New Delhi, Apr 02 (ANI): While addressing party leaders at the election manifesto release for Lok Sabha elections 2019, Congress president Rahul Gandhi said, "Prime Minister had spoken about MGNREGA. He mocked and said it is a bogus and useless scheme. Today everyone knows how much it helped the country. So now we want to guarantee jobs for 150 days, instead of 100 days, under the scheme. We waived off loans within 2 days and we thought there should be a separate budget for the farmers."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.