వాజ్పేయిూ, అడ్వాణీ ఇద్దరూ భాజపాలో అగ్రనాయకులని దీదీ పేర్కొన్నారు. అడ్వాణీ లాంటి నేతను భాజపా పక్కన పెట్టడం బాధాకరమన్నారు. సీనియర్లకు భాజపా విలువ ఇవ్వడం లేదని ఆరోపించారు.
"ఇన్నేళ్లూ మనం చూశాం..అడ్వాణీ భాజపాకు అసలైన మార్గదర్శకులు. కొత్త తరం నాయకులు వచ్చారు.. పాత రోజులను మర్చిపోయారు. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇది ఆయనకు జరిగిన అవమానం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. వారు దీన్ని అంగీకరించకపోవచ్చు" - మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
యువతకు, మహిళలకు, అన్ని వర్గాలకు సీట్లు కేటాయించాలి. కానీ సీనియర్ నాయకులను పక్కన పెట్టకూడదని దీదీ హితవు పలికారు. ఈ లోక్సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ లాంటి సీనియర్ నాయకులు పోటీ చేస్తున్నట్లు మమత ప్రస్తావించారు.
అడ్వాణీ పోటీ చేసే గాంధీనగర్ స్థానాన్ని భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు కేటాయిస్తూ మార్చి 21న పార్టీ ప్రకటించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.