అయోధ్యలో ఈ నెల 5న జరగనున్న రామ మందిర భూమి పూజకు భాజపా అగ్ర నాయకులు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిని ఆహ్వానించామని ఆలయ ట్రస్ట్ అధికారి ప్రకాశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. వారిని ఆహ్వానించలేదని వచ్చిన వార్తలు కేవలం వదంతులేననని, వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టంచేశారు.
'అడ్వాణీ, జోషీ సహా మరికొందరు ప్రముఖులకు మెయిల్, ఫోన్ ద్వారా సమాచారం అందించాం. మహమ్మారి కారణంగా ఎక్కువ మంది పూజలో పాల్గొనకపోవచ్చు. మరికొందరికి ప్రయాణ ఇబ్బందులు ఉండవచ్చు. అంతేకానీ మేము వారిని పిలవలేదనే మాటల్లో వాస్తవం లేదు. అందరి మనోభావాలను గౌరవించడమే ట్రస్ట్ విధి.'
- ప్రకాశ్ కుమార్ గుప్తా, శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్క్షేత్ర ట్రస్ట్ అధికారి
పోస్ట్ ద్వారా పంపే ఆహ్వానం సమయానికి చేరుకుంటుందనే నమ్మకం లేదని చెప్పారు గుప్తా. అందుకోసమే వ్యక్తిగతంగానూ వారికి ఫోన్ చేసి ఆహ్వానించామన్నారు.
ఇదీ చదవండి: అయోధ్య... రామ జన్మభూమా? కొత్త ఆలయమా?