సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ చరిత్రాత్మక విజయంపై భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ సంతోషం వ్యక్తం చేశారు. భాజపా సహా ఎన్డీఏ మిత్రపక్షాలు 353 లోక్సభ స్థానాల్లో విజయదుందుభి మోగించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశానికి హాజరైన అడ్వాణీ ఫలితాలపై స్పందించారు.
"సంఖ్య విన్నాక సంతోషంగా ఉంది. 353 సాధించారు. ఈ విజయం భాజపాకు అపూర్వమైన పరిణామం. ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేశారు. ఎంతో ఆనందంగా ఉంది."
-ఎల్కే అడ్వాణీ, భాజపా అగ్రనేత
ఇదీ చూడండి: ప్రభుత్వ ఏర్పాటుకు మోదీకి రాష్ట్రపతి ఆహ్వానం