ETV Bharat / bharat

పిల్లల్ని బడికి పంపకపోవడమే అభివృద్ధా?: ప్రియాంక - PRIYANKA SAYS KASHMIR LACK DOWN CHILDRENS IMPACT MOST

కశ్మీర్​లో కొనసాగుతున్న ఆంక్షలపై ట్విట్టర్​ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు ప్రియాంక గాంధీ. ఆంక్షల వల్ల ఎక్కువగా చిన్నారులే నష్టపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

పిల్లల్ని బడికి పంపకపోవడమే అభివృద్ధా?: ప్రియాంక
author img

By

Published : Oct 4, 2019, 12:35 PM IST

కశ్మీర్​లో రెండు నెలలుగా కొనసాగుతున్న ఆంక్షలపై కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్​ వేదికగా కేంద్రాన్ని విమర్శించారు. ఆంక్షల ప్రభావం చిన్నారులపై ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. పాఠశాలలకు విద్యార్థులు వెళ్లకపోవటం వలన స్నేహితులతో సంబంధాలను తెగిపోయాయని, ఇందుకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు ప్రియాంక.

priyanka tweet
ప్రియాంక ట్వీట్​

"అభివృద్ధి కోసం విద్యార్థులను పాఠశాలలకు పంపకుండా చేసే ప్రభుత్వాన్ని ఎక్కడైనా చూశారా?"
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్వీట్​.

ఈ చర్యల ద్వారా భావితరాలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రియాంక.

ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370ని రద్దు చేసింది. అప్పటి నుంచి కశ్మీర్​లో​ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:ఇరాక్​: హింసాత్మక ఘటనల్లో 34కు చేరిన మృతులు

Malda (West Bengal), Oct 04 (ANI): Two people drowned after boat carrying passengers capsized in Mahananda River on October 03. According to Malda District Magistrate, Kaushik Bhattacharya, two people have died and 28 have been rescued. NDRF personnel are present at the spot. The boat was carrying people to Katihar in Bihar from Malda in West Bengal.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.