ETV Bharat / bharat

శివసేనలోకి ప్రముఖ నటి ఊర్మిళ

author img

By

Published : Dec 1, 2020, 2:13 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే సమక్షంలో నటి ఊర్మిళా మాతోండ్కర్​ శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉద్ధవ్ సతీమణి రష్మీ ఠాక్రే.. ఊర్మిళకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Urmila Matondkar
ఊర్మిళకు కండువా కప్పుతోన్న ఉద్ధవ్​ ఠాక్రే సతీమణి

ప్రముఖ నటి ఊర్మిళా మాతోండ్కర్ శివసేనలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే ఆధ్వర్యంలో ఆమె శివసేన కండువా కప్పుకున్నారు.​

బాల్​ ఠాక్రే చిత్రపటానికి ఊర్మిళ నమస్కారం
Urmila Matondkar
శివసేనలో చేరిన నటి ఊర్మిళా మాతోండ్కర్

హిందీ, దక్షిణ భాషల్లో అనేక చిత్రాలు చేసిన ఊర్మిళ.. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు మార్చి నెలలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. లోక్​సభ ఎన్నికల్లో ఉత్తర ముంబయి నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అంతర్గత కలహాలు, స్వార్థపూరిత రాజకీయాల మధ్య ఉండలేనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారామె.

ఇదీ చూడండి: భారత్​ భేరి: 'రంగీలా' రాజకీయం ఫలించేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.