ప్రజాకర్షణ శక్తి...! రాజకీయాల్లో ఎంతో కీలకం. ఎన్నికల్లో గెలుపోటముల్ని నిర్ణయించే అంశాల్లో ఒకటి. ఈ ప్రజాకర్షణ శక్తే ప్రథమ అర్హతగా ప్రజాజీవితంలోకి వస్తున్నారు సినీ తారలు. ఎంతో మంది విజయం సాధించారు.
"మోతీ నందన్ బహుగుణను చూస్తే.. అలహాబాద్ ఆయన కర్మభూమి. జాతీయ స్థాయిలో దిగ్గజ నేత. కానీ ఏమైంది? అమితాబ్ బచ్చన్ వెళ్లారు. మోతీనందన్ ఓటమి పాలయ్యారు. 'మేరీ అంగేనామే తుమారా క్యా కామ్ హై' అంటూ ప్రచారంలో అమితాబ్ ఓ పాటపాడారు. బహుగుణ రాజకీయాల్లో నుంచే వైదొలిగారు. ఇది ఎప్పటినుంచో నడుస్తోంది. కొత్త విషయమేమీ కాదు."
-శశిధర్ పాఠక్, సీనియర్ పాత్రికేయుడు
17వ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నవారిలో హీరోలతో పోల్తితే కథానాయికల సంఖ్యే అధికంగా ఉంది. ఇప్పటికే భారీ విజయాలు అందుకున్న అలనాటి తారలతో పాటు యువతరం నటీమణులూ రాజకీయ అరంగేట్రం చేశారు. హేమమాలిని, జయప్రద, సుమలత, ఊర్మిళ, మిమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్, అర్షి ఖాన్.. ఈసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
"మనది పురుష సమాజం. ఆకర్షణ అనేది సహజం. గ్లామర్‌తో పాటు మరిన్ని అంశాలు ఉంటాయి. వారిలో కళ ఉంది. ఆ కళతో ప్రజల్ని మేల్కొల్పుతారు. రాజకీయాల్లో మహిళలు ఎంతో అవసరం. రాహుల్‌కన్నా ప్రియాంక ఎక్కువ సఫలం అయ్యారు. మనం మహిళలను కూడా ప్రజాప్రతినిధులుగా కోరుకుంటున్నాం. వాళ్లు ముందుకు రావాలి. సమాజాన్ని కొత్త దిశలో నడిపించాలి."
-శశిధర్ పాఠక్, సీనియర్ పాత్రికేయుడు
మరోమారు డ్రీమ్‌గర్ల్
ఉత్తరప్రదేశ్ మధురలో 2014 ఎన్నికల్లో 3.3 లక్షల మెజారిటీతో విజయం సాధించారు డ్రీమ్‌గర్ల్ హేమమాలిని. ఇప్పుడు మరోమారు అదే స్థానం నుంచి పోటీకి దిగారు. స్థానికయేతర వ్యక్తి అనే కోణంలో ప్రత్యర్థులు సాగిస్తున్నారు. హేమ మాత్రం... మరోమారు విజయమే లక్ష్యంగా ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు.
తెలుగు తారలు
సమాజ్‌వాదీ పార్టీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు జయప్రద. తర్వాత ఆమె రాజకీయ జీవితంలో అనేక మలుపులు. ఇటీవలే భాజపాలో చేరారు. ఉత్తరప్రదేశ్ రాంపుర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగారు.
2004, 2009లో ఎస్పీ తరఫున పోటీ చేసి రాంపుర్‌లో గెలిచారు జయప్రద. 2014లో రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థిగా బిజ్‌నోర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు.
ఇవీ చూడండి:
సుమలత... ఈసారి కన్నడ రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణ. భర్త అంబరీశ్ మరణం తర్వాత మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారామె. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్... ఆమెకు ప్రధాన ప్రత్యర్థి.
అంబరీశ్ అభిమానులకు తోడు భాజపా మద్దతివ్వడం సుమలతకు కలిసొచ్చే అంశం.
రంగీలా రాజకీయం
"నిజాయితీయే నా అజెండా" అంటూ రాజకీయాల్లోకి వచ్చారు ఊర్మిళ మాతోంద్కర్. కాంగ్రెస్‌లో చేరారు. మహారాష్ట్రలో భాజపా కంచుకోట ఉత్తర ముంబయిలో ఊర్మిళను పోటీ దింపింది కాంగ్రెస్. గతంలో హీరో గోవింద అదే స్థానం నుంచి విజయం సాధించారు. ఇప్పుడదే ఫలితం పునరావృతం లెక్కలు వేసుకుంటోంది కాంగ్రెస్.
ఇవీ చూడండి:
బిగ్ బాస్ హౌస్ నుంచి...
ఈ లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు బెంగాలీ నటీమణులు పోటీలో నిలబడ్డారు. బాసిర్‌హట్ నియోజకవర్గం నుంచి నుస్రత్ జహాన్, జాదవ్‌పూర్ నుంచి మిమీ చక్రవర్తి పోటీచేస్తున్నారు. బంగాల్లో వీరిద్దరికి అభిమానుల సంఖ్య ఎక్కువ.
బిగ్‌బాస్ సెలబ్రిటీలు శిల్పా శిందే, అర్షి ఖాన్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు.
వెండితెరపై అలరించిన అందాల తారలు రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తారో చూడాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.
ఇవీ చూడండి: