ETV Bharat / bharat

భారత్​లో 6 లక్షల దిగువకు యాక్టివ్​ కేసులు

దేశంలో మూడు నెలల తర్వాత తొలిసారి క్రియాశీల కేసుల సంఖ్య 6 లక్షల దిగువకు వచ్చినట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం నమోదైన కేసుల్లో ప్రస్తుతం 7.35శాతం మాత్రమే యాక్టివ్​ కేసులు ఉన్నట్లు తెలిపింది.

Active caseload below 6 lakh for the first time after 85 days
దేశంలో 6 లక్షల దిగువకు కరోనా యాక్టీవ్​ కేసుల సంఖ్య
author img

By

Published : Oct 30, 2020, 10:37 PM IST

దేశంలో 85 రోజుల తర్వాత యాక్టివ్​ కేసుల సంఖ్య 6లక్షల కంటే దిగువకు వచ్చినట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం భారత్​లో 5,94,386 క్రియాశీల​ కేసులు ఉన్నాయి.

"ప్రపంచంలోనే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య భారత్​లోనే అధికం. కోలుకున్నవారి సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య మధ్య తేడా క్రమంగా పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం ప్రతి 10లక్షల మందిలో 844 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది జాతీయ సగటుగా ఉంది. కానీ దిల్లీ, కేరళ రాష్ట్రాలు 3వేల పరీక్షలు చేస్తున్నాయి. "

---కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.

తగ్గుతున్న యాక్టివ్​ కేసుల సంఖ్య

శుక్రవారం ఉదయం నాటికి 57,386 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా 48,648 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 91.15 శాతానికి చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారినుంచి కోలుకున్న వారి సంఖ్య 73,73,375గా ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.

కేరళలో అత్యధికంగా

మొత్తం రికవరీ కేసుల్లో దాదాపు 80శాతం మంది 10రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళలో అత్యధికంగా రోజుకు 8 వేల మంది వైరస్​ నుంచి కోలుకుంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గురువారం నమోదైన 48,648 కేసుల్లో 78శాతం కేవలం 10రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి.

కేరళలో అత్యధికంగా రోజుకు 7వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ తర్వాతి స్థానంలో ఉన్నాయి. రోజుకు ప్రతి పది లక్షల మందిలో 140 మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలన్న డబ్ల్యూహెచ్ఓ లక్ష్యానికి భారత్​ చేరుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.