కొంత మంది అవినీతి పరులపై చర్యలు తీసుకున్నంత మాత్రాన కార్పొరేట్ వ్యవస్థను ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నట్టు కాదని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. కిర్లోస్కర్ సోదరుల శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. తన పాలనపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నించారు.
"కొన్ని అవినీతి సంస్థలపై చర్యలు తీసుకున్నాం. అది చూసి కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం అణచివేస్తోందని భావించవద్దు. పారదర్శక వాతావరణంలో పరిశ్రమలు ఎలాంటి భయం లేకుండా సంపదను సృష్టించాలన్నదే మా ప్రయత్నం. ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యాల్లో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఒక దశ మాత్రమే. అంతకన్నా భారీ ఆశయాల దిశగా కృషి చేస్తున్నాం.
పన్ను వ్యవస్థలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం ఉండాలన్నదే మా ధ్యేయం. పన్ను శాఖలో మానవ జోక్యం తగ్గించాలని ప్రయత్నిస్తున్నాం. కార్పొరేట్ పన్నునూ అత్యల్పానికి తగ్గించాం."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: దిల్లీ దంగల్: త్రిముఖ పోరులో నిలిచి గెలిచేదెవరో?