ETV Bharat / bharat

రోడ్డుపై యాసిడ్​ ట్యాంకర్​ లీక్​.. అంతా భయం గుప్పిట్లో! - Acid tanker leak news

మధ్యప్రదేశ్​ రత్లాంలో ఓ యాసిడ్​ ట్యాంకర్​ లీకేజీకి గురైంది. ప్రధాన రహదారి మొత్తం తెల్లటి పొగ కమ్మేయటం వల్ల పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Acid tanker leak causes havoc on Ratlam bypass
రోడ్డుపై యాసిడ్​ ట్యాంకర్​ లీక్​
author img

By

Published : Aug 13, 2020, 4:13 PM IST

మధ్యప్రదేశ్​ రత్లాంలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని బైపాస్​ మార్గంలో ఓ యాసిడ్​ ట్యాంకర్​ లీకేజీకి గురైంది. ఆ ప్రాంతం మొత్తం తెల్లటి పొగతో నిండిపోయింది. దీంతో పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Acid tanker leak causes havoc on Ratlam bypass
తెల్లటి పొగతో నిండిన ప్రాంతం

క్లోరోసల్ఫోరిక్​ యాసిడ్​ నింపుకొని నగ్దా నుంచి గుజరాత్​లోని అహ్మదాబాద్​ వైపునకు ట్యాంకర్ వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. రత్లాంలోని బైపాస్​ రోడ్డులో లీకేజీ కాగా.. భారీగా తెల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. లీకేజీని గుర్తించిన డ్రైవర్​ వెంటనే లారీని ప్రధాన రహదారి నుంచి పక్క దారిలోకి తీసుకెళ్లి నిలిపేశాడు.

ఆ తర్వాత అహ్మదాబాద్​ డ్రెస్సింగ్​ కంపెనీకి చెందిన సిబ్బంది, సంఘటనాస్థలానికి చేరుకుని యాసిడ్​ను మరో ట్యాంకర్​లోకి మార్చారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవటం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు.

మరో ట్యాంకర్​లోకి మారుస్తున్న దృశ్యం

ఇదీ చూడండి: అన్నీ మరచిపోయి ముందుకు సాగాలి: గహ్లోత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.