జమ్ముకశ్మీర్‌ను సందర్శించాలన్న గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆహ్వానాన్ని స్వీకరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అక్కడి ప్రజలతో కలిసేందుకు బేషరతుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
"మాలిక్... నా ట్వీట్‌కు మీరు ఇచ్చిన దుర్బలమైన సమాధానాన్ని చూశాను. మీ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నాను. బేషరతుగా కశ్మీర్ ప్రజలను కలిసేందుకు అవకాశం ఇవ్వండి... నేను ఎప్పుడు రావాలి?"
-ట్విట్టర్లో రాహుల్ గాంధీ
ఇదీ జరిగింది...
కశ్మీర్లో హింసాత్మక వాతావరణం నెలకొందన్న రాహుల్ వ్యాఖ్యలపై స్పందించారు గవర్నర్ సత్యపాల్ మాలిక్. పరిస్థితి అదుపులోనే ఉందని... ఒకసారి కశ్మీర్‌ను సందర్శించాలని, ఇందుకోసం ప్రత్యేక విమానం పంపుతామని చెప్పారు.
గవర్నర్ ఆహ్వానం స్వీకరించిన రాహుల్... ప్రత్యేక విమానం అక్కరలేదని, విపక్ష నేతలతో కూడిన బృందంతో కశ్మీర్‌కు వస్తామని చెప్పారు. ప్రజలు, సైన్యం, ప్రధాన నేతలతో సమావేశమయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రాహుల్ వినతిపై మంగళవారం స్పందించిన మాలిక్... రాహుల్ డిమాండ్లు ఉద్రిక్తతలు సృష్టించేవిగా ఉన్నాయని సమాధానమిచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఎప్పుడు రావాలంటూ నేడు మరోసారి ట్వీట్ చేశారు రాహుల్.
ఇదీ చూడండి: 'రాహుల్ విమానం పంపిస్తాం.. కశ్మీర్ రండి!'