సాధారణంగా అభిమాన హీరో సినిమా విడుదలైతే సంబరపడి స్టైల్ మారుస్తుంటారు యువకులు. ఇప్పుడు మాత్రం గగన వీరుడు అభినందన్ వర్ధమాన్ మీసం స్టైల్‌నే ఫాలో అవుతున్నారు. గన్ స్లింగర్ మీసం కోసం సెలూన్లకు క్యూ కడుతున్నారు.
"రెండు రోజుల క్రితం అభినందన్ పాకిస్థాన్ నుంచి తిరిగి వచ్చారు. యువతలో ఆయనకు చాలా క్రేజ్ ఉంది. రోజూ 5 నుంచి 10 మంది యువకులు సెలూన్‌కు వస్తారు. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలు షారుక్, సల్మాన్‌ను ఫాలో అయ్యాం. అభినందన్ రియల్ హీరో కనుక ఆయనలా మీసాలు, హెయిర్ స్టైల్ కావాలని అడుగుతున్నారు. మేము చేస్తున్నాం." - సమీర్ ఖాన్, సెలూన్ యజమాని, బెంగళూరు
సెలూన్ షాపుల్లో ఒకప్పుడు ధోని హెయిర్ స్టైల్ యమా ట్రెండ్ సృష్టించింది. ప్రస్తుతం అభినందన్ స్టైల్ హవా నడుస్తోంది.
"ఇది అభినందన్ సార్ స్టైల్. నేను ఆయన అభిమానిని. అందుకే అనుసరిస్తున్నాను. ఆయన రియల్ హీరో. ఇలా చేయడం నాకు నచ్చింది, బావుంది. అందుకే ఈ స్టైల్ చేయించుకున్నాను."
-మహ్మద్ చాంద్, అభినందన్ అభిమాని, బెంగళూరు