ETV Bharat / bharat

హీరో 2.0: వినువీధుల్లో అభినందనుడి విన్యాసం - iaf

పాక్​ వాయుసేనతో వీరోచితంగా పోరాడిన వింగ్​ కమాండర్ వర్ధమాన్ అభినందన్​ మరోసారి యుద్ధ విన్యాసాలు చేశారు. పాక్ సైనికాధీనం నుంచి మార్చి 2న స్వదేశానికి తిరిగివచ్చిన వర్ధమాన్​.. శారీరక, మానసిక పరీక్షల తర్వాత నేడు పఠాన్​కోట్​లో తొలిసారి మిగ్​-21లో దూసుకెళ్లారు.

వినువీధుల్లో అభినందనుడి విన్యాసం
author img

By

Published : Sep 2, 2019, 6:05 PM IST

Updated : Sep 29, 2019, 4:50 AM IST

వినువీధుల్లో అభినందనుడి విన్యాసం

భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్​ వర్ధమాన్... మరోసారి మిగ్​-21 విమానంలో యుద్ధ విన్యాసాలు చేశారు. పాక్​ సేనకు చిక్కి, విడుదలైన అనేక నెలల తర్వాత తొలిసారిగా విమానాన్ని నడిపారు. పంజాబ్​ పఠాన్​కోట్​ వైమానిక స్థావరం నుంచి వాయుసేన అధినేత​ బీఎస్​ ధనోవాతో కలిసి ఆకాశ వీధుల్లో దూసుకెళ్లారు వర్ధమాన్.

వాయుసేన అధిపతిగా ధనోవా పదవీకాలం మరికొద్దిరోజుల్లో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తన చివరి యుద్ధ విన్యాసాలు వర్ధమాన్​తో చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఆయన. అభినందన్​ తండ్రితోనూ మిగ్​-21లో యుద్ధ విన్యాసాలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు ధనోవా.

"అభినందన్​తో కలిసి ఆకాశ వీధుల్లోకి దూసుకెళ్లడం నాకు ఎంతో గర్వకారణం. 1998లో నేను కూడా పైలట్ విధులకు దూరమయ్యాను. తిరిగి విధుల్లో చేరేందుకు నాకు 9 నెలలు పట్టింది. అభినందన్ 6 నెలల కంటే తక్కువ సమయంలోనే తిరిగి వచ్చాడు. మిగ్​-21 శిక్షకుడిగా మళ్లీ చేరాడు. అది ఎంతో గొప్ప విషయం. మా ఇద్దరికీ రెండు లక్షణాలు ఒకేలా ఉన్నాయి. అందులో మొదటిది... ఇద్దరం విధులకు దూరమయ్యాం. రెండవది ఇద్దరం పాకిస్థాన్​పై పోరాడాం. నేను కార్గిల్​లో, అభినందన్ బాలాకోట్​లో శత్రువులపై యుద్ధం చేశాం. నా చివరి యుద్ధ విన్యాసాలు ఒక యోధుడితో చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది."

- బీఎస్ ధనోవా, వాయుసేన అధిపతి

అధీనం నుంచి వీర్​చక్ర వరకు...

పుల్వామా దాడి అనంతరం భారత​ వాయుసేన(ఐఏఎఫ్).. పాక్​లోని జైషే మహ్మద్​ ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా.. ఫిబ్రవరి 27న మనదేశ గగనతలంలోకి చొరబాటుకు యత్నించిన పాక్ విమానాలను తిప్పికొట్టింది ఐఏఎఫ్​. ఈ పోరాటంలో తాను నడుపుతున్న మిగ్-21 విమానం ప్రత్యర్థి భూభాగంలో కూలిపోయిన కారణంగా దాయాది సేనలకు చిక్కారు అభినందన్. అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో మార్చి 2న అభినందన్​ను భారత్​కు అప్పగించింది పాక్.

పాక్​ సైన్యం అధీనం నుంచి భారత్​ చేరుకున్న అభినందన్​కు తీవ్ర గాయాలైనందున విధుల నుంచి తాత్కాలికంగా తప్పించారు అధికారులు. రక్షణ, నిఘా సంస్థల అధికారుల సమక్షంలో శారీరక, మాససిక పరీక్షలు నిర్వహించారు. బెంగళూరులోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఏరోస్పేస్​ మెడిసిన్ ధ్రువీకరణతో ఐఏఎఫ్​ చీఫ్​తో కలిసి మరోసారి గగనతలంలో దూసుకెళ్లారు అభినందన్​.

బాలాకోట్​ వైమానికి దాడుల్లో పాక్​ సైన్యంతో వీరోచితంగా పోరాడినందుకు.. యుద్ధ సమయాల్లో సైనికులను సత్కరించే మూడో అత్యున్నత అవార్డు.. వీర్​చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసింది కేంద్రం.

ఇదీ చూడండి: ధనోవా సమక్షంలో అభినందన్​ యుద్ధ విన్యాసాలు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Washington - 1 September 2019
1. SOUNDBITE (English) Donald Trump, US President:
"Americans are strong, determined and resilient and we will support each other, and we will work very hard to minimize whatever the effect of what's coming out. We don't even know what's coming out. All we know is it's possibly the biggest I have, not sure, I'm not sure that I've even heard of a Category 5. I knew it existed. And I've seen some Category fours. You don't even see that that much. A Category 5 is something that, I don't even know that I've heard the term other than I know it's there. That's the ultimate and that's what we have, unfortunately."
STORYLINE:
US President Donald Trump spoke about Hurricane Dorian on Sunday, commenting that he wasn't sure that he'd ever heard of a Category 5 hurricane before.
The president made his comments during a briefing with the Federal Emergency Management Agency (FEMA) about Hurricane Dorian.
Hurricane Maria, which devastated Puerto Rico in 2017, was a Category 5.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 4:50 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.