భారత వాయుసేన పైలెట్ అభినందన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ఆయన స్వదేశంలో కాలు మోపనున్నారు. మధ్యాహ్నం అభినందన్‌ను భారత్‌కు అప్పగిస్తామని పాక్ విదేశాంగ మంత్రి మహమ్మూద్ ఖురేషీ స్పష్టం చేశారు.
మీ జోక్యం కావాలి..
దక్షిణాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి, రష్యా జోక్యం చేసుకోవాలని ఖురేషీ కోరారు.
నేను హాజరుకాను:
అంతర్జాతీయ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశానికి తాను హాజరు కావడం లేదని ఖురేషీ స్పష్టం చేశారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరు కావడమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు.
సందడిగా వాఘా సరిహద్దు:
అభినందన్‌కు స్వాగతం పలికేందుకు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు భారత వైమానిక దళ అధికారులు. ప్రస్తుతం అమృత్‌సర్‌లో పర్యటిస్తోన్న పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అభినందన్‌కు స్వాగతం పలికేందుకు వాఘా చేరుకున్నారు.