కేరళ- తిరువనంతపురంలోని విథురాలో ఓ ఏనుగు మృతిచెందింది. శనివారం ఉదయం అటవీ సరిహద్దుకు సమీపంలోని పెరట్లో చనిపోయిన ఆడ ఏనుగును ఓ కూలీ గుర్తించాడు. అయితే.. ఆ గజరాజు ఒంటికి గాయాలమీ లేకపోగా.. దాని చుట్టూ ఓ పిల్ల ఏనుగు తిరుగుతూ కంటతడి పెట్టుకుంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన గజరాజుకు శవపరీక్ష చేయించేందుకు చర్యలు చేపట్టారు. పిల్ల ఏనుగును స్థానిక కొట్టూరులోని ఏనుగుల సంరక్షణ కేంద్రానికి తరలించాలని అటవీ శాఖ నిర్ణయించింది.
ఇదీ చదవండి: కేరళ తీరంలో తగ్గిన 'ఆలివ్ రిడ్లీ' తాబేలు గూళ్లు!