కర్ణాటకలో ఓ ఇంట్లో కష్టపడి రూ. 1.4 లక్షలతో పాటు ప్యాంటు కాజేసిన ఓ దొంగ.. ఆ సొమ్మంతా తిరిగిచ్చేశాడు. చామరాజనగర్ సమీపంలోని కొల్లెగలకు చెందిన అస్ఫర్ బైక్ డీలర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం అస్ఫర్ ఓ బైక్ విక్రయించి వచ్చిన డబ్బంతా తన ప్యాంటు జేబులో పెట్టుకొని ఇంటికి వచ్చాడు. ప్యాంటును డబ్బుతో పాటే, కిటీకీ దగ్గరున్న ఓ హ్యాంగర్‌కి తగిలించి నిద్రపోయాడు.
అర్థరాత్రి ఇంట్లోకి దూరిన దొంగకు ప్యాంటులో డబ్బు కనిపించింది. దీంతో ఆ దుస్తులతో పాటే డబ్బంతా పట్టుకొని ఉడాయించాడు. ఉదయం లేచేసరికి ప్యాంటు కనిపించకపోయేసరికి.. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు అస్ఫర్.
పోలీసులు విచారణ మొదలెట్టి దొంగ ఎవరో కనిపెట్టకముందే.. శనివారం ఉదయం ప్యాంటుతో పాటు డబ్బంతా అస్ఫర్ ఇంటి ముందు పెట్టి వెళ్లిపోయాడు ఆ దొంగ.
ఇదీ చదవండి: ఇట్లు.. మీ షాపులో చోరీకి యత్నించిన దొంగ!