ETV Bharat / bharat

పదేళ్ల బాలికతో తాంత్రికుడు సజీవ దహనం - కిస్తూరాం

పదేళ్ల బాలికతో ఓ తాంత్రికుడు సజీవదహనమైన ఘటన రాజస్థాన్​లో వెలుగులోకి వచ్చింది. పొలంలో గుంత తవ్వి అందులోనే నివసిస్తున్న ఆ వ్యక్తి.. అక్కడే పెట్రోల్ పోసుకొని బాలికతో సహా నిప్పంటించుకున్నాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

a-tantric-committed-self-immolation-with-a-girl-in-barmer
పదేళ్ల బాలికతో తాంత్రికుడు సజీవ దహనం
author img

By

Published : Dec 12, 2020, 6:17 PM IST

Updated : Dec 12, 2020, 10:21 PM IST

రాజస్థాన్​లో ఓ తాంత్రికుడు పదేళ్ల బాలికతో కలిసి సజీవ దహనమయ్యాడు. మంత్ర తంత్రాల్లో భాగంగానే ఈ దారుణానికి ఒడిగట్టాడని పలువురు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. బఖాసర్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాడ్​మేర్​ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

తాంత్రికుడిని కిస్తూరాంగా పోలీసులు గుర్తించారు. అతడి నివాసానికి సమీపంలోని ఓ గుంతలో మృతదేహాలను కనుగొన్నారు. పెట్రోల్ బాటిళ్లు, ఇతర సామగ్రిని గుర్తించారు.

a-tantric-committed-self-immolation-with-a-girl-in-barmer
తాంత్రికుడు సజీవదహనమైన చోటు

రెండేళ్లుగా కిస్తూరాం ఈ ప్రాంతంలో తిరుగుతున్నాడని బాధితురాలి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ పొలంలో తవ్విన గుంతలోనే ఆయన నివసిస్తున్నాడని తెలిపారు. అదే గుంతలో తన కూతురితోపాటు నిప్పంటించుకున్నాడని చెప్పారు.

కిస్తూరాం పాకిస్థాన్​ నుంచి 2014లో భారత్​కు వీసా ద్వారా వచ్చి దేశంలో అక్రమంగా ఉంటున్నాడని సమాచారం. బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Dec 12, 2020, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.