ETV Bharat / bharat

35కి.మీ వెళ్లి హోంవర్క్​ చూపించిన బుడతడు - homework story of pavan kanthi

హోం వర్క్​ అనగానే సాకులు చెప్పి తప్పించుకునే పిల్లలు చాలా మందే ఉంటారు. కానీ కర్ణాటక హుబ్లీకి చెందిన ఓ కుర్రాడు మాత్రం ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్​ను చేసి... వాళ్ల టీచరుకు చూపించడానికి సుమారు 35 కి.మీ ప్రయాణించాడు. ఇంట్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. కుమారుడు అడగ్గానే వెంటనే ఆ గురువు దగ్గరికి తీసుకెళ్లింది తల్లి.

A Student Travelled 35Kms to Show his Homework to Class Teacher
35కి.మీ వెళ్లి హోంవర్క్​ చూపించిన బుడతడు.!
author img

By

Published : Oct 31, 2020, 4:30 PM IST

Updated : Oct 31, 2020, 10:21 PM IST

35కి.మీ వెళ్లి హోంవర్క్​ చూపించిన బుడతడు.!

కర్ణాటక హుబ్లీలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల కుర్రాడు పవన్​ కంతి. చదువు అంటే అతనికి ఎంతో ఆసక్తి. కరోనా మహమ్మారి కారణంగా అతడి చదువు ఆగిపోయింది. పాఠశాల యాజమాన్యం ఆన్​లైన్​ తరగతులు నిర్వహిస్తున్నా.. కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఊరులో మొబైల్​ సిగ్నల్​ సమస్యలు అతనికి సహకరించలేదు.

నెలకు సరిపడా హోంవర్క్​..

చదువుకోవాలనే సంకల్పంతో తల్లిదండ్రులను ఓ కోరిక కోరాడు పవన్​. కుమారుడు అడిగిందే తడవుగా తల్లి పార్వతి.. టీచర్​ అనసూయ దగ్గరకు తీసుకెళ్లింది. కుర్రాడి ఆసక్తిని చూసి ఉపాధ్యాయురాలు నెలకు సరిపడా హోం వర్క్​ను, అందుకు సంబంధించిన పుస్తకాలను ఇచ్చారు. సరిగ్గా నెలరోజుల అంతా పూర్తి చేశాడు. పూర్తి చేసిన వర్క్​ను టీచర్​కు చూపించేందుకు 35 కి.మీలు తల్లితో కలిసి ప్రయాణించాడు.

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం..

పవన్​ తల్లిదండ్రులు దినసరి కూలీలు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. కానీ చదువు పట్ల కుమారుడి ఆసక్తి చూసి ఆనందపడుతున్నారు. తాము కష్టపడైనా కొడుకుని గొప్పవాడిని చేస్తామంటున్నారు తల్లి పార్వతి.

ఇదీ చూడండి:ఆ రాష్ట్రంలో ఇకపై మాస్క్​ ధరించటం తప్పనిసరి!

Last Updated : Oct 31, 2020, 10:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.