ETV Bharat / bharat

ఆ దూడకు రెండు తలలు- ఆరు కాళ్లు

author img

By

Published : Oct 18, 2020, 11:16 AM IST

కర్ణాటకలో ఓ ఆవు.. రెండు తలలు, ఆరు కాళ్లతో ఉన్న దూడకు జన్మనిచ్చింది. అయితే తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఆ దూడ ప్రాణాలు కోల్పోయింది.

strange calf
రెండు తలలు, ఆరు కాళ్లతో దూడ జననం..

సాధారణంగా దూడలు నాలుగు కాళ్లు, ఓ తలతో పుడతాయి. కానీ ఉత్తర కర్ణాటక సిద్ధపుర తాలూకాలోని సిర్సి ప్రాంతంలో మాత్రం ఆరుదైన లేగదూడ జన్మించింది. రెండు తలలు, ఆరు కాళ్లతో అది అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

అయితే దూడకు జన్మనిచ్చేటప్పుడు ఆవు తీవ్రంగా ఇబ్బందిపడింది. తల్లి ప్రాణానికి ప్రమాదమని గుర్తించిన వైద్యులు.. అరుదైన శస్త్రచికిత్స చేశారు. పశువైద్యుడు డాక్టర్​. శ్రేయస్​ రాజ్​ నేతృత్వంలోని బృందం దాదాపు రెండు గంటలు కష్టపడి దూడను బయటకు తీశారు. అయితే తల్లి ప్రాణాలు దక్కినా.. ఆరుకాళ్లతో పుట్టిన పిల్ల మాత్రం చనిపోయింది. ఈ అరుదైన దూడను చూసేందుకు జనాలు భారీగా వచ్చారు. ఆవు ప్రాణాలు కాపాడిన వైద్యుడిని అందరూ మెచ్చుకున్నారు.

Strange Calf with Two Head and Six Legs
రెండు తలలు, ఆరు కాళ్ల దూడ

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.