ETV Bharat / bharat

ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే ఒదిగిపోయింది!

ఆమె.. సంప్రదాయం ఉట్టిపడేలా తలనిండా పూలు పెట్టుకుంటోంది. నుదుటన చక్కని బొట్టు దిద్దుకుంటోంది. ఉదయాన్నే లేచి, వాకిలి ఊడ్చేసి అందంగా ముగ్గులు పెట్టేస్తోంది. ఆవు పాలు పితికేస్తోంది. చకచకా బట్టలు ఉతికేస్తోంది. పొలంలో నారు పెట్టేస్తోంది. ఆపై తనకు నచ్చిన అక్షరాలు నేర్చుకుంటోంది. ఇందులో గొప్పేముంది మన గ్రామాల్లో అమ్మాయిలంతా చేసే పనేగా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఆమె స్పెయిన్​లో పుట్టి పెరిగింది. ఇప్పుడు కర్ణాటకలో భారతీయ సంస్కృతిని అలవరచుకుంది!

A Spain Girl Became the Karnataka Girl after Stays in state amid the Lockdown, learned kannada language
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే ఒదిగిపోయింది!
author img

By

Published : Aug 2, 2020, 7:28 AM IST

ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే ఒదిగిపోయింది!

విదేశీయులు మన దేశానికి వస్తే... కళ్లకు నల్ల కళ్లద్దాలతో దర్శనమిస్తూ 'వావ్ ఇండియా ఎంత బాగుంది' అని చూసి తరిస్తారు. భారత సంసృతి నచ్చిందని మాటల్లో చెప్పడమే కానీ, ఇక్కడ పనులన్నీ ఎంతో ఇష్టంగా నేర్చుకునేవారు ఎంతమంది ఉంటారు? కానీ, థెరిసా మాత్రం అలా కాదు. పుట్టింది పెరిగింది స్పెయిన్ దేశంలోనే అయినా... మన సంస్కృతి నచ్చి, కర్ణాటక సంప్రదాయంలో ఒదిగిపోయింది.

లాక్​డౌన్ వల్లే ...

స్పెయిన్​కు చెందిన థెరిసా 4 నెలల క్రితం పర్యటకురాలిగా భారత్​కు వచ్చింది. ఇంతలో ప్రభుత్వం లాక్​డౌన్ విధించింది. దీంతో కర్ణాటకలో చిక్కుకుపోయిందామె. ఉడుపి, హెరంజల్​లోని కృష్ణ పూజారి వారింట్లో ఆశ్రయం పొందింది. రోజూ వారు ఇంట్లో చేసే పనులు, భారతీయ సంస్కృతి థెరిసాకు తెగ నచ్చేశాయి. ఆ కుటుంబ సభ్యులను చూసి తానూ ఆ పనులన్నీ నేర్చుకోవడం మొదలు పెట్టింది.

A Spain Girl Became the Karnataka Girl after Stays in state amid the Lockdown, learned kannada language
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే ఒదిగిపోయింది!

కుందపుర యాసలో కన్నడ భాష నేర్చుకుని.. గ్రామస్థులతోనూ ఇట్టే కలిసిపోయింది థెరిసా. భారతీయ కట్టుబొట్టు అలవాటు చేసుకుంది. వాకిట్లో ముగ్గులు పెట్టడం, కర్ణాటక వంటకాలు, ఆవు పాలు పితకడం, బురద మడిలో దిగి నారు పెట్టడమే కాదు.. కర్ణాటక అక్షరాలు రాయడం చదవడం పూర్తిగా నేర్చేసుకుంది.

ముంబయిలోని ఓ అమెరికా కంపెనీలో పని చేస్తున్న సమయంలో కృష్ణ పుజారికి పరిచయమయ్యాడు.. థెరిసా సోదరుడు. ఆ పరిచయంతోనే అడగ్గానే ఆమెను ఓ అతిథిగా ఇంటికి తీసుకొచ్చాడు కృష్ణ పూజారి కానీ, ఇప్పుడు ఆమె ఆ కుటుంంబంలో ఒకటిగా కలిసిపోయింది. ఇప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తే.. థెరిసా తిరిగి స్పెయిన్​కు వెళ్లిపోవాల్సి వస్తోంది. కానీ, తనను పంపించడం పూజారి కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదు. తనకు కూడా భారతదేశాన్ని వదిలివెళ్లాలని లేదంటోంది స్పెయిన్​ సుందరి.

ఇదీ చదవండి: 'అమ్మ తాళి తాకట్టు పెట్టి, మా కోసం టీవీ కొనేసింది!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.