కేరళ కోజికోడ్‌కు చెందిన గీతబాయి అనే విశ్రాంత ఉపాధ్యాయురాలు ఆకర్షణీయమైన పర్యావరణహిత నూలు బ్యాగులు తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు.
ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌పై అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా నిషేధం విధించినప్పటికీ, మార్కెట్లో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వేరే వస్తువు లేనప్పుడు అదెలా సుసాధ్యం అవుతుంది? అందుకే నిత్యం వాడే ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో నూలు వస్త్రాలతో తయారు చేసిన బ్యాగులను వాడాలనే సందేశంతో గురుకులం ఆర్ట్ గ్యాలరీ వద్ద ఈ బ్యాగుల ప్రదర్శన ఏర్పాటు చేశారు గీత.
ఆలోచన పుట్టిందిలా..
ఈ వస్త్ర బ్యాగుల తయారీ గురించి యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నారు గీత. ప్లాస్టిక్ రహిత ఉపకరణాలు తయారు చేయాలన్న ఆమె ఆలోచనకు భర్త ప్రోత్సాహం తోడైంది. అలా ఐదేళ్ల క్రితం మహిళలు, పురుషులకు పర్స్‌లు, బ్యాగులు తయారు చేయడం ప్రారంభించారు.
అమ్మాయిలు కళాశాలలకు, కార్యాలయాలకు, పార్టీలకు తీసుకువెళ్లేలా, పిల్లలకూ నచ్చే విధంగా విభిన్న డిజైన్లలో, బోలెడన్ని రంగుల్లో నూలు బ్యాగులు తయారుచేసి విక్రయిస్తున్నారు.
ఈ అందమైన సంచుల ధరలు డిజైన్‌ను బట్టి 50 రూపాయల నుంచి 500 రూపాయల దాకా ఉన్నాయి. ప్లాస్టిక్ వాటికన్నా దారపు పోగులతో చేసిన బ్యాగులే మిన్నా అని చెబుతున్న గీతకు సర్వత్రా ప్రశంసలందుతున్నాయి.
ఇదీ చూడండి:మన్మోహన్‌ను అనుసరించమన్న భర్త... మరి మంత్రి ఏమన్నారు!