లైంగిక వేధింపుల నుంచి ట్రాన్స్‌జెండర్లకు, తృతీయ ప్రకృతి వ్యక్తులకు రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రస్తుతం పురుషులు, మహిళలకు మాత్రమే లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందే నిబంధనలు ఉన్నాయి.
అయితే.. తృతీయ ప్రకృతి వ్యక్తుల విషయంలో భారత శిక్షా స్మృతిలోగానీ, ఇటీవల అమల్లోకి తెచ్చిన సవరణల్లోగానీ ఎలాంటి నిబంధనలు లేవు. వీరిపై లైంగిక వేధింపులు పాల్పడేవారికి శిక్షలు లేకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని ఆరోపిస్తూ రీపక్ కన్సల్ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఇదీ చదవండి: శ్రీకృష్ణ జన్మభూమిలో ఈద్గా తొలగింపునకు పిటిషన్