ETV Bharat / bharat

'అమ్మ తాళి తాకట్టు పెట్టి, మా కోసం టీవీ కొనేసింది!' - gadag mother sold mangalasutra

కర్ణాటకకు చెందిన ఓ తల్లి.. తన బిడ్డల భవిష్యత్తు కోసం మంగళసూత్రాన్నే తాకట్టు పెట్టేసింది. పిల్లల ఆన్​లైన్ చదువు కోసం టీవీ కొనేసింది. పిల్లలకంటే తనకేదీ ఎక్కువ కాదని అందుకే స్తోమత లేకపోయినా టీవీ కొన్నానంటోంది.

a-mother-pleged-her-mangalya-chain-to-buy-the-television-for-online-classes-of-her-children
'అమ్మ తాళి తాకట్టు పెట్టి, మా కోసం టీవీ కొనేసింది!'
author img

By

Published : Jul 31, 2020, 6:06 PM IST

లాక్​డౌన్ పరిణామాలు పేదలను, రోజూ కూలీలను మరింత కుదిపేస్తున్నాయి. రెక్కాడితేగాని డొక్కాడని వారి జీవితాలకు పిల్లల చదువు మరో సవాలుగా మారింది. దీంతో, కర్ణాటకకు చెందిన ఓ మహిళ పిల్లల చదువు ఆగకూడదని మంగళసూత్రం తాకట్టు పెట్టి, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసింది.

a-mother-pleged-her-mangalya-chain-to-buy-the-television-for-online-classes-of-her-children
'అమ్మ తాళి తాకట్టు పెట్టి, మా కోసం టీవీ కొనేసింది!'

గదగ్ జిల్లా, నరగుండా తాలూకా రాడర్ నాగనూరు గ్రామానికి చెందిన సావిత్రి, ఆమె భర్త రోజూ కూలీ చేసుకుని జీవనం సాగించేవారు. కానీ, లాక్​డౌన్ నుంచి వారికి ఉపాధి కరువైంది. రోజు గడవడమే కష్టంగా మారింది. వారి పిల్లలు అభిషేక్, సురేఖ​లు వరుసగా 7, 8 తరగతులు చదువుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీడీ చందన ఛానెల్​లో ఆన్​లైన్​ తరగతులను ప్రసారం చేయిస్తోంది. కానీ, సావిత్రి ఇంట్లో స్మార్ట్ టీవీ లేదు. దీంతో అందరి పిల్లల్లా తమ బిడ్డలు చదువుకోలేకపోతున్నారని బాధపడింది.

అప్పు చేసైనా స్మార్ట్ టీవీ కొనాలని నిర్ణయించుకుంది సావిత్రి. కానీ, అప్పు ముట్టలేదు. ఆఖరికి పిల్లలు చదువుతున్న స్కూలు టీచర్లను సాయం కోరింది.. వారి నుంచీ ఎలాంటి సహకారం అందలేదు. దీంతో తన మెడలోని తాళిని కుదవపెట్టాలని నిర్ణయించుకుంది. మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టగా రూ. 20 వేలు వచ్చాయి. రూ.14000 పెట్టి ఓ స్మార్ట్ టీవీ కొనేసింది. బిడ్డలకు మంచి భవిష్యత్తునివ్వడం కంటే తనకేదీ ఎక్కువ కాదని, అందుకే స్తోమతకు మించి టీవీ కొనుగోలు చేశానంటోంది సావిత్రి.

ఇదీ చదవండి: ప్రధాని మోదీకి రాఖీ పంపిన పాక్​ సోదరి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.