పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. వివాహం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు యువతీయువకులు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ తండ్రి తన కుమారుడికి బొమ్మతో వివాహం చేశాడు. తన కొడుకు మానసిక వ్యాధితో బాధపడుతున్న కారణంగానే బొమ్మతో పెళ్లి చేసినట్లు చెబుతున్నాడు ఆ తండ్రి.
నాకు తొమ్మిది మంది కుమారులు. వారిలో ఎనిమిది మంది వివాహం చేశాను. చివరి కొడుక్కి ఎటువంటి ఆస్తి లేదు. అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అందుకే బొమ్మతో పెళ్లి చేశాను.
-పెళ్లి కుమారుడి తండ్రి.
ఇదీ చూడండి:చైనాతో వివాదంపై నేడు ప్రధాని అఖిలపక్ష భేటీ