అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న కర్ణాటక బెంగళూరుకు చెందిన అజయ్ కుమార్.. కట్నం కోసం మూడో పెళ్లి చేసుకున్నాడు. అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందిగా భార్యను వేధిస్తున్నాడు. దీంతో ఆ యువతి బెంగళూరులోని శివాజీనగర్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. నిందితుడితోపాటు, బాధితురాలి అత్తామామలపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
రెండు పెళ్లిళ్లను దాచి.. 2015లో మూడో వివాహం చేసుకున్న అజయ్‌కుమార్, ఫ్లాట్కోసం మొదట రూ. 7లక్షలు కట్నంగా తీసుకున్నాడు. 2017లో మళ్లీ రూ. 3లక్షల 70వేలు తీసుకున్నాడు. కట్నం ఇంకా కావాలని డిమాండ్ చేస్తూ వచ్చాడు. చంటిబిడ్డతో భార్యను ఇంట్లో నుంచి వెళ్లగొట్టి ఇంటికి తాళం వేసి క్రూరంగా ప్రవర్తించాడు.
తొలుత అజయ్ కుమార్ ఓ ఆన్లైన్ వివాహ సైట్ ద్వారా దిల్లీకి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. తర్వాత పెద్దల సమక్షంలో రెండో వివాహం అయ్యింది. వేధింపులు భరించలేక ఆమె వెళ్లిపోయింది. తరువాత 2015లో మూడో వివాహం చేసుకున్నాడు.