ప్రకృతిలోని ప్రతి జీవితోనూ మానవునికి అనుబంధం ఉంటుంది. అందులో పశువులతో పెను వేసుకున్న బంధం ప్రత్యేకం. ఆవును తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించిన ఓ కుటుంబం.. దానికి ఘనంగా సీమంతం చేసింది. కర్ణాటకలోని బెళగావిలో జరిగిన ఈ వేడుక.. ఆ ఊళ్లో పండుగ వాతావరణాన్ని తలపించింది.
చిక్కోడి తాలుకాలోని యక్షాంబ గ్రామానికి చెందిన తుకారమ మాలి.. గతంలో కష్టాలతో సమతమతవుతున్న క్రమంలో ఓ ఆవును తెచ్చుకుని పెంచుకోమని కొందరు సలహా ఇచ్చారు. అప్పటినుంచి ఆయన గోమాతను పెంచుకుంటున్నారు. అనంతరం తన కష్టాలు తొలిగిపోయి.. ఆర్థిక పరిస్థితీ మెరుగైందని తెలిపారు మాలి. ఆ ఆవుకు 'గౌరి' అనే పేరు పెట్టి సొంత కూతురిగా భావించి.. ఎంతో ఆప్యాయంగా దాని బాగోగులు చూసుకుంటున్నారు. ఇటీవల అది గర్భం దాల్చి ఐదు నెలలైన సందర్భంగా ఘనంగా సీమంతం నిర్వహించారు. రంగు రంగుల చీరలు, పూలు వేసి అందంగా అలంకరించారు.
ఈ కార్యక్రమానికి ఆ ఊరి ప్రజలు పెద్దఎత్తున హాజరై అంగరంగ వైభవంగా వేడుకను జరిపించారు. అతిథులకు రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశాడు మాలి.
ఇదీ చదవండి: కేరళ తీరంలో తగ్గిన 'ఆలివ్ రిడ్లీ' తాబేలు గూళ్లు!