ETV Bharat / bharat

రాజస్థాన్​లో వానలు ఖతం- ఒడిశాలో తుపాను సూచన!

రాజస్థాన్​లో నైరుతీ రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైన వేళ.. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. ఒడిశాలో తుపాను సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది.

a-cyclonic-circulation-lies-over-south-coastal-odisha
రాజస్థాన్ లో వానలు ఖతం.. ఒడిశాలో తుపాను సూచన!
author img

By

Published : Oct 6, 2020, 6:54 PM IST

దేశంలో వివిధ చోట్ల భిన్న వాతావరణం నెలకొన్నట్లు తెలిపింది భారత వాతావరణ శాఖ. ఒడిశా దక్షిణ తీర ప్రాంతంలో.. తుపాను సూచనలు కనిస్తున్నాయని హెచ్చరించింది. బిహార్, తూర్పు బంగాల్ కోస్తా ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తున రుతుపవనాలు వీస్తున్నట్లు తెలిపింది.

రాజస్థాన్​లో వర్షాలు పూర్తిగా నిలిచిపోయాయని.. గాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో నైరతీ రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని తెలిపింది. ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు వెల్లడించింది.

తూర్పు మధ్య ప్రదేశ్, విదర్భ, ఛత్తీస్​గఢ్​, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, బంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపుర, మిజోరాం, త్రిపురల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ.

ఇదీ చదవండి: రాహుల్‌గాంధీ ఖేతీ బచావో యాత్రలో ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.