సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు, ఆయనను ఇరికించేందుకు కుట్ర జరిగిందనడం వంటి విషయాలపై స్పందించారు సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్. సంతోశ్ హెగ్డే. ఇవన్నీ సుప్రీంకోర్టు నైతిక నిష్ఠకు పెద్ద దెబ్బేనన్నారు.
న్యాయమూర్తులను ప్రలోభాలకు గురిచేసి తీర్పులు ఇప్పిస్తున్నారని వస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి అత్యున్నత న్యాయస్థానానికి చాలా సమయం పడుతుందన్నారు.
ఇదీ చూడండి: 'మీ మెరుపుదాడి పేదలపై- మాది పేదరికంపై'
''చివరకు ఎలాంటి ఫలితాలు వచ్చినా.. ఇది విచారకర పరిస్థితి. న్యాయవ్యవస్థ గౌరవానికి దెబ్బ. ఎందుకంటే కొందరు సీజేఐకి మద్దతిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వ్యాజ్యదారులకు అనుకూలంగా తీర్పులు ఇప్పించడానికి ధర్మాసనాలను ప్రభావితం చేసేవారు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలతో న్యాయవ్యవస్థ నైతిక సమగ్రతకు హాని జరుగుతుంది.''
- ఎన్. సంతోశ్ హెగ్డే, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి