తమిళనాడులో రూపాయికి నాలుగు ఇడ్లీలు అమ్ముతూ అందరి ఆకలి తీరుస్తున్న కమలత్తాళ్ బామ్మ కథ మరువక ముందే మరో ఇడ్లీ బామ్మ వెలుగులోకి వచ్చింది. రామేశ్వరంలోని అగ్ని తీర్థం దగ్గర రాణి అనే 70 ఏళ్ల బామ్మ ఎన్నో సంవత్సరాల నుంచి హోటల్ నడుపుతోంది.
సాధారణంగా ప్లేట్ ఇడ్లీకి రూ.30 తీసుకుంటోంది. అయితే పేదలకు మాత్రం ఇక్కడ టిఫిన్ ఉచితం. కేవలం వ్యాపారం కోసం హోటల్ నడపడం లేదని.. ఎవరి దగ్గరైనా డబ్బు లేకపోతే ఉచింతంగా టిఫిన్ పెడతామని తెలిపింది. ఇప్పటికీ పుల్లల పొయ్యి మీదే వంట చేస్తూ.. నలుగురి ఆకలి తీరుస్తోంది ఈ బామ్మ.