ETV Bharat / bharat

బిడ్డకు జన్మనిచ్చిన 12 ఏళ్ల బాలిక - 12 year old raped in Jodhpur

రాజస్థాన్​లో తొమ్మిది నెలల క్రితం అత్యాచారానికి గురైన 12ఏళ్ల బాలిక.. ఉమ్మెద్​ ఆసుపత్రిలో ఓ శిశువుకు జన్మనిచ్చింది.

A 12-year-old girl, raped nine months ago by her neighbour delivered a boy in Umed Hospital
బిడ్డకు జన్మనిచ్చిన 12ఏళ్ల బాలిక!
author img

By

Published : Dec 29, 2020, 3:29 PM IST

రాజస్థాన్​ జోధ్​పుర్​లోని అత్యాచారానికి గురైన 12ఏళ్ల బాలిక.. ఉమ్మెద్​ ఆసుపత్రిలో ఓ బాలుడికి జన్మనిచ్చింది.

ఆరో తరగతి చదువుతున్న ఆమెపై తొమ్మిది నెలల క్రితం పొరుగున ఉన్న 30ఏళ్ల కిరాతకుడు అఘాయిత్యానికి పాల్పడగా గర్భం దాల్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు తన మొబైల్​ ఫోన్​ చూపిస్తానని ఆశ చూపి బాలికపై దారుణానికి ఒడిగట్టాడని పేర్కొన్నారు.

ఆ దుర్ఘటన తర్వాత బాలిక ఆరోగ్యం క్షీణించగా.. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే అక్కడ వైద్యులు మరో ఆసుపత్రి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం బాలికపై జరిగిన దారుణం గురించి కుటుంబ సభ్యులకు తెలిసింది.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.