కుటుంబాన్ని పోషించేందుకు ఛత్తీస్‌గఢ్ బీజాపుర్ నుంచి తెలంగాణకు వచ్చింది ఓ 12 ఏళ్ల బాలిక. పేరూరులో 2 నెలలుగా పనిచేస్తోంది. లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఇక్కడ ఉండలేక బాలికతో పాటు మరో 11 మంది ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరారు.
3 రోజుల తర్వాత 100 కిలోమీటర్ల మేర ప్రయాణించి బీజాపుర్‌లోని మోడక్‌పాల్ గ్రామానికి చేరుకుంది. తీవ్ర ఎండ, ఆకలితో ఆ బాలిక డీహైడ్రేషన్‌తో కుప్పకూలిపోయింది. స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
మేల్కొన్న అధికారులు..
ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. ఆ బాలికతో వచ్చిన 11 మందిని క్వారంటైన్‌కు తరలించారు. కూతురి మరణ వార్త తెలియగానే ఆమె తల్లిదండ్రులు బీజాపుర్ ఆసుపత్రికి చేరుకున్నారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇదీ చూడండి: పదో తరగతి విద్యార్థి హత్య.. చంపింది స్నేహితులే!