ETV Bharat / bharat

90ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం - latest rape

త్రిపురలో అమానవీయ ఘటన జరిగింది. తొంబై ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

90-year-old woman raped by gang in Tripura
90ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం
author img

By

Published : Nov 1, 2020, 11:25 AM IST

తొంబై ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం జరిగిన దారుణ ఉదంతమిది. త్రిపురలోని కంచన్‌పుర్‌ సబ్‌డివిజన్‌లో చోటుచేసుకున్న ఈ హీన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గత నెల 24న తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బామ్మ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారని ఆరోపిస్తూ 29న ఫిర్యాదు నమోదయింది. అత్యాచారం అనంతరం తాను అనారోగ్యం బారిన పడినా.. ఘటన గురించి బాధితురాలు పోలీసులకు చెప్పలేదు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడం వల్ల ఐదు రోజుల అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితులలో ఒకరు బాధితురాలికి తెలుసని, ఆమెను బామ్మ అని పిలిచేవాడని ఎస్పీ భానుపాడా చక్రవర్తి చెప్పారు. నిందితులు పరారీలో ఉన్నారని, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని ఆయన వెల్లడించారు. వృద్ధురాలిని ఆసుపత్రిలో చేర్పించి ఆమె వాంగ్మూలం స్వీకరించామని ఎస్పీ తెలిపారు.

ఇదీ చూడండి: 'నా ప్రియుడు వస్తాడు.. ఈ పెళ్లి వద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.