తమిళనాడులో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. చికిత్స అందించే వైద్యులు కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో 90మంది వైద్యులకు వైరస్ సోకినట్టు ఓ అధికారి తెలిపారు.
"10రోజుల వ్యవధిలో 80-90మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో చాలా తక్కువమంది డాక్టర్లు.. కరోనా బాధితులకు చికిత్స అందించారు. మిగిలిన వారు వివిధ విభాగాలకు చెందినవారు."
-- అధికారి.
ఆసుపత్రిలో వైద్యుల కొరత వల్ల.. దాదాపు 300మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి బదిలీ అయ్యారు.
తాము సరిగ్గా తిని, నిద్రపోయి.. 3 నెలలయ్యిందని, కుటుంబసభ్యులతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదని అధికారి పేర్కొన్నారు. వాట్సాప్, ఇతర సాంకేతికతతోనే కుటుంబ సభ్యులను చూస్తున్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి:- కరోనా బాధితుల్లో ఉండే 8 ప్రధాన లక్షణాలివే