నైరుతి రుతుపవనాలు దాదాపు దేశమంతా విస్తరించినా 84 శాతం వాతావరణ ఉప కేంద్రాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ విభాగం ప్రకటించింది.
దేశంలో 91 ప్రధాన జలాశయాల్లో సాధారణం కంటే 80 శాతం తక్కువ నీటి నిల్వలున్నట్లు కేంద్ర నీటి సంఘం (సెంట్రల్ వాటర్ కమిషన్) తెలిపింది. 11 జలాశయాల్లో సున్నా శాతానికి నీటి నిల్వలు పడిపోయినందున ఆయా ప్రాంతాల్లో నీటి సంక్షోభం మరింత తీవ్రమైందని స్పష్టం చేసింది.
మొత్తం 36 వాతావరణశాఖ ఉప కార్యాలయాల్లో 25 లోటు వర్షపాతాన్ని నమోదైందని గణించాయి. మరో 6అధిక లోటు వర్షపాతం నమోదైనట్టు... మిగిలిన 5 కార్యాలయాల్లో... ఒడిశా, లక్షద్వీప్ సాధారణ వర్షపాతం, జమ్ముకశ్మీర్, తూర్పు రాజస్థాన్ కార్యాలయాలు అధిక వర్షపాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని వాతావరణ విభాగం కార్యాలయం అతి భారీ వర్షపాతం నమోదైనట్టు తెలిపాయి.
భారత వాతావరణ శాఖకు తూర్పు - ఈశాన్య, దక్షిణ ద్వీపకల్పం, మధ్య భారత్, వాయువ్య భారత్తో కలిపి నాలుగు విభాగాలున్నాయి. ఇందులో తూర్పు - ఈశాన్య భారత్ విభాగం... ఈశాన్య రాష్ట్రాలతో పాటు తూర్పు రాష్ట్రాలైన బిహార్, జార్ఖండ్, పశ్చిమ బంగాల్ రాష్ట్రాల్లో లోటు వర్షపాతాన్ని నమోదుచేసింది. మధ్య భారత్ పరిధిలోని 10 ఉప విభాగాల్లో ఒడిశా రాష్ట్రంలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.
తీవ్ర నీటి సంక్షోభంతో సతమతమవుతున్న తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ఉపవిభాగాల్లో 38 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణంగా వర్షాకాలం జూన్ 1 న మొదలై సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. అయితే ఈ ఏడాది ఏడు రోజులు ఆలస్యంగా జూన్ 8న రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి.
ఇదీ చూడండి : 'చిత్తశుద్ధి లేనందునే మల్టీ లెవల్ మోసాలు'