ETV Bharat / bharat

ఆ 8 రాష్ట్రాల్లోనే 90 శాతం కరోనా కేసులు

దేశంలో యాక్టివ్‌ కరోనా కేసుల్లో 90 శాతం 8 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. కరోనా మరణాల్లో 86 శాతం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే సంభవించాయి. మంత్రుల బృందం సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. దేశంలో 80 శాతం యాక్టివ్‌ కేసులు కేవలం 49 జిల్లాల్లోనే ఉండటం గమనార్హం.

author img

By

Published : Jul 9, 2020, 4:55 PM IST

8 states account for 90 pc active coronavirus cases in India: GoM on COVID-19 informed
కరోనా కేసుల్లో 90 శాతం ఆ 8 రాష్ట్రాల్లోనే..

దేశంలోని మొత్తం కరోనా యాక్టివ్‌ కేసుల్లో 90 శాతం 8 రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌లో యాక్టివ్‌ కరోనా కేసులు అధికంగా ఉన్నట్లు తెలిపింది. దేశంలో 500కి పైగా జిల్లాలు ఉండగా.... 80 శాతం యాక్టివ్‌ కరోనా కేసులు 49 జిల్లాల్లోనే నమోదుకావడం గమనార్హం.

దేశంలో ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాల్లో 86 శాతం ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, బంగాల్‌లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల బృందం భేటీలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కరోనా మరణాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

సగటున 538 మందికి

కరోనా కేసుల్లో ప్రపంచ సగటు 10 లక్షల మందికి 1453గా ఉంటే భారత్‌లో అది 538గా నమోదైంది. కరోనా మరణాల్లో ప్రపంచ సగటు 10 లక్షల మందికి 68.7గా ఉండే భారత్‌లో అది 15గా నమోదైంది.

మూడు వేల చికిత్సా కేంద్రాలు..

దేశంలో కరోనా చికిత్సా కేంద్రాలు 3 వేల 914 ఉన్నాయి. వీటిలో ఐసోలేషన్‌ పడకలు 3 లక్షల 77 వేల 737, ఐసీయూ పడకలు 39 వేల 820, లక్షా 42 వేల 415 ఆక్సిజన్‌ సపోర్టు పడకలు, 20 వేల 47 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 21 కోట్ల 30 లక్షల ఎన్​-95 మాస్కులను, కోటి 20 లక్షల వ్యక్తిగత రక్షణ కిట్లను, 6 కోట్ల 12లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను పంపిణీ చేసినట్లు మంత్రుల బృందానికి అధికారులు తెలిపారు.

మరింత కఠినంగా...

కంటైన్‌మెంట్‌ నిబంధనలు కఠినంగా పాటించడం, కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడం, వృద్ధుల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిని పర్యవేక్షించడం, హాట్‌ స్పాట్లుగా మారే ప్రాంతాలను ముందుగా గుర్తించడం, ఆరోగ్య సేతు వంటి యాప్‌లను సమర్థంగా వినియోగించుకోవడం, క్రిటికల్‌ కేర్‌ పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు వంటిని సమకూర్చుకోవడం వంటి వాటిపై దృష్టిపెట్టినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ తెలిపారు. కరోనా సోకిన వారిని ముందుగానే గుర్తించి మరణాల శాతం తగ్గించే దిశగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:స్వచ్ఛ భారత్​కు జైకొడుతూ మోదీకి వెండి విగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.