బిహార్ లఖీసరాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హల్సీ గ్రామ సమీపంలోని 11కేవీ విద్యుత్ స్తంభాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
హల్సీలో ఓ పెళ్లివేడుక జరుగుతుంది. వేగంగా దూసుకొచ్చిన లారీ వారిని తప్పించబోయి నియంత్రణ కోల్పోయింది. అంతే వేగంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మరణించగా మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం అనంతరం.. డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.
విషాదంలో మునిగిపోయిన గ్రామస్థులు లఖీసరాయి-సికిందర్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు నచ్చచెప్పి గ్రామస్థులను శాంతింపజేశారు.
ఇదీ చూడండి: 'రూ.10 కోట్ల ఆస్తి ఉన్న వధువు కావలెను'