అసోంలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా మరో ఏడుగురు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 33కు చేరింది.
భారీ వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగిపడి.. బార్పేట జిల్లాలో ముగ్గురు, ధుబ్రి, నాగావూన్, నల్బారీ, కచార్ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లో మొత్తం 15లక్షల మంది తీవ్రంగా ప్రభావితమైనట్లు అసోం విపత్తు నిర్వాహణ అథారిటీ (ఏఎస్డీఎంఏ) తెలిపింది. ఇప్పటి వరకు 27వేల మందిని సహాయక శిబిరాలకు తరలించినట్లు స్పష్టం చేసింది.
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు జాతీయ విపత్తు స్పందన దళం, రాష్ట్ర విపత్తు స్పందన దళం, స్థానిక అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు.
ఇదీ చూడండి: 'కరోనిల్' అమ్మకాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కానీ..