ఉత్తరాఖండ్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 16 మంది మరణించారు.
పాఠశాల బస్సు...
తెహ్రీ గర్వాల్లోని కాంగ్సాలీలో ఓ పాఠశాల బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 9 మంది చిన్నారులు చనిపోయారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 18 మంది విద్యార్థులు ఉన్నారు.
దుర్ఘటన గురించి సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు స్పందన దళం రంగంలోకి దిగింది. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించింది.
మరో చోట...
లంబాగడ్ ప్రాంతంలో బద్రీనాథ్ రహదారిపై వెళ్తున్న మరో బస్సుపై బండ రాయి పడింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు మరణించారు. మరికొందరు మంది లోపల చిక్కుకున్నారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు.