కల్తీ మద్యం సేవించి ఉత్తరాఖండ్ దెహ్రాదూన్‌లోని కోత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నేశవిలా రోడ్డు సమీపంలో పథరీ పీర్ కొత్త బస్తీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కల్తీ మద్యం సేవించి గురువారం ముగ్గురు మరణించగా.. శుక్రవారం మరో నలుగురు మృతి చెందారు.
లిక్కర్ మాఫియా.. ఆధికారులతో కుమ్మక్కై కల్తీ మద్యాన్ని విక్రయిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా ఒకరి తరువాత ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న స్థానిక భాజపా ఎమ్మెల్యే గణేశ్ జోషి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఘటనపై అధికారులను ఆరా తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: జూదంలో భార్యనే పందెం పెట్టిన ఘనుడు!