ETV Bharat / bharat

కరోనాపై గెలిచినా వెంటాడిన మృత్యువు - భారత్​లో కరోనా కేసులు

ఫిలిప్పీన్స్​కు చెందిన ఓ వృద్ధుడు ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందాడు. ఇటీవల ఆయన కరోనా బారినపడి కోలుకున్నప్పటికీ.. మూత్రపిండాల వ్యాధితో మరణించాడని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

68-yr-old man who recovered from COVID-19 dies in Mumbai
కరోనాపై గెలిచి మృత్యువు చేతిలో ఓడాడు!
author img

By

Published : Mar 23, 2020, 3:27 PM IST

ఆయనకు కరోనా సోకింది. అయినా అధైర్యపడలేదు. మొండిగా పోరాడాడు. ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి ఆయన చేతిలో ఓడిపోయింది. అయితే వెనువెంటనే వచ్చిన మృత్యువును మాత్రం జయించలేకపోయాడు.

అసలేం జరిగింది?

ఫిలిప్పీన్స్​కు చెందిన 68 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్​గా తేలింది. ముంబయి కస్తూర్బా ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. తర్వాత ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి మార్చారు. అయితే మూత్రపిండాల వ్యాధితో సోమవారం మృతి చెందాడు.

ఆయనకు మధుమేహం, ఆస్తమా, మూత్రపిండాల వ్యాధి, శ్వాసకోస సమస్యలు ఉన్నాయని తెలిపింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

ఇదీ చదవండి: 'ఎయిర్ ​ఇండియా' తెగువకు ప్రధాని ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.