కరోనా సంక్షోభం పరిస్థితుల్లో ఏ విధమైన ప్రయాణం భద్రమనే అంశంపై బడ్జెట్ విమాన సంస్థ ఇండిగో ఓ సర్వే చేపట్టింది. ఇందులో 68శాతం మంది విమాన ప్రయాణాలకే ఓటు వేసినట్టు తెలిపింది.
ఓ నగరం నుంచి మరో నగరానికి వెళ్లడానికి విమాన ప్రయాణాలే అత్యంత భద్రమని 68శాతం మంది తెలిపారు. కేవలం 8శాతం మంది రైలు ప్రయాణానికి మద్దతు పలికారు. 24శాతం మంది సొంత డ్రైవింగ్‌కు ఓటేశారు.
25వేలమందిపై గత నెలలో ఈ ఆన్లైన్ సర్వే జరిపింది ఇండిగో. అయితే 'విమాన ప్రయాణాలే ఎందుకు భద్రం?' అన్న ప్రశ్నను కూడా వేసింది. దీనికి పలు కారణాలను వెల్లడించారు సర్వేలో పాల్గొన్న వారు.
- ఇతర ప్రయాణికులు(62శాతం)
- క్వారంటైన్ నిబంధనలు(55శాతం)
- విమానాల్లో ఇతరులతలో కూర్చోవడం(55శాతం)
అయితే ఇండిగోలో ప్రయాణించడం అత్యంత భద్రతతో కూడిన విషయమని 65శాతం మంది ఓటు వేయడంపై సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ప్రయాణికుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మరిన్ని చర్యలు చేపడతామని హామీనిచ్చింది.
ఇదీ చూడండి:- మోదీ విమానాన్ని మిసైల్స్ కూడా ఢీకొట్టలేవా..?