పాస్‌పోర్ట్ లేని కారణంగా పాకిస్థాన్‌లో 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఓ మహిళ మంగళవారం ఆమె సొంతూరు అయిన ఔరంగబాద్‌కు తిరిగివచ్చింది. కుటుంబసభ్యులు, పోలీసులు ఆమెను స్వాగతించారు. స్వదేశానికి తిరిగి వచ్చినందుకు ప్రశాంతంగా ఉందని ఆమె పేర్కొంది.
అసలు ఏం జరిగింది..
మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు చెందిన 65 ఏళ్ల హసీనా బేగమ్ 18 ఏళ్ల క్రితం ఆమె భర్త బంధువులను కలుసుకునేందుకు పాకిస్థాన్‌కు వెళ్లింది. లాహోర్‌లో ఆమె పాస్‌పోర్ట్ పోగొట్టుకుంది. పాస్‌పోర్ట్ లేని కారణంగా హసీనాకు పాకిస్థాన్ జైలు శిక్ష విధించింది.
ఔరంగాబాద్ పోలీసుల నివేదిక
హసీనా నిర్దోషి అని రుజువు అవ్వడానికి భారత్ నుంచి పాకిస్థాన్ సమాచారం కోరింది. దీనిపై ఔరంగబాద్ పోలీసులు పాక్‌కు వివరాలు వెల్లడించడం వల్ల హసీనాను గత వారం పాక్ భారత్‌కు అప్పగించింది. సిటీ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె పేరున ఇల్లు ఉందని ఔరంగబాద్ పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. భారత్‌కు తిరిగి రావడంలో సహకరించినందుకు ఔరంగబాద్ పోలీసులకు హసీనా, ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి : ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది దుర్మరణం