ETV Bharat / bharat

50వేల వెంటిలేటర్లు ఆ నిధులతో ఆర్డర్​ చేసినవే!

కరోనాను ఎదుర్కొనేందుకు ఐసీయూ వెంటిలేటర్లు ఉత్పత్తిలో మేకిన్​ ఇండియాకు పెద్దపీట వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 60వేల వెంటిలేటర్లకు కేంద్రం ఆర్డర్‌ ఇవ్వగా... అందులో 50వేల వెంటిలేటర్లను పీఎం- కేర్స్‌ నిధులతో ఆర్డర్‌ చేసినట్లు ఆ శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ చెప్పారు.

50 thousand ventilators ordered from PM Cares
50వేల వెంటిలేటర్లు ఆ నిధులతో ఆర్డర్​ చేసినవే!
author img

By

Published : Aug 4, 2020, 11:06 PM IST

కరోనాపై పోరులో కీలకమైన ఐసీయూ వెంటిలేటర్ల ఉత్పత్తి విషయంలో మేకిన్‌ ఇండియాకు పెద్దపీట వేసినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం 60వేల వెంటిలేటర్లకు కేంద్రం ఆర్డర్‌ ఇవ్వగా.. అందులో 96 శాతం వెంటిలేటర్లు మేకిన్‌ ఇండియాలో భాగమేనని ఆ శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. అందులో 50వేల వెంటిలేటర్లను పీఎం- కేర్స్‌ నిధులతో ఆర్డర్‌ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

కరోనాకు ముందు దేశంలో వెంటిలేటర్ల తయారీ పరిశ్రమ అంతంతగానే ఉందని రాజేశ్‌ భూషణ్‌ అన్నారు. అలాంటిది ఇప్పుడు ఓ భారీ పరిశ్రమగా రూపుదిద్దుకుందని చెప్పారు. కేంద్రం 60వేల వెంటిలేటర్లకు ఆర్డర్‌ చేసిందని, వీటి తయారీలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌), ఆంధ్రా మెడ్‌టెక్‌ జోన్‌ది కీలక పాత్ర అని తెలిపారు. మొత్తం 50వేల వెంటిలేటర్ల కొనుగోలుకు రూ.2వేల కోట్లు పీఎం- కేర్స్‌ నుంచి వెచ్చించినట్లు తెలిపారు. ఇప్పటికే 18వేల వెంటిలేటర్లు రాష్ట్రాలకు చేరాయన్నారు. దేశంలో కరోనా బారిన పడిన వారిలో 0.27 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్‌ సపోర్ట్‌ అవసరం అవుతోందని వివరించారు.

ఇదీ చూడండి: 28 ఏళ్ల ఉపవాసం ముగించనున్న 'కలియుగ ఊర్మిళ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.