ETV Bharat / bharat

ఆ 49మంది ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బందికి కరోనా

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. తాజాగా ఒడిశాలోని 49మంది ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బందికి వైరస్​ నిర్ధరణ అయ్యింది. అంపన్​ తుపాను నేపథ్యంలో వీరందరు బంగాల్​లో సహాయక చర్యలు చేపట్టి ఇటీవలే ఒడిశాకు తిరిగివచ్చారు.

49 personnel of NDRF tested Covid-19 +ve in Odishas Cuttack
ఆ 49మంది ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బందికి కరోనా
author img

By

Published : Jun 9, 2020, 11:00 AM IST

ఒడిశాలోని 49 మంది ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బందికి కరోనా వైరస్​ సోకింది. వీరందరూ అంపన్​ తుపాను నేపథ్యంలో బంగాల్​లో విధులు నిర్వర్తించి ఇటీవలే ఒడిశాకు వచ్చారు. వీరు కటక్​లోని ముండాలి ప్రాంతానికి చెందిన ఎన్​డీఆర్​ఎఫ్​ 3వ బెటాలియన్​ సభ్యులని తెలుస్తోంది.

అంపన్​ తుపాను నేపథ్యంలో పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి బంగాల్​ వెళ్లిన 173 సభ్యుల బృందంలో ఈ 49మంది జవాన్లు ఉన్నారు. ఈ నెల 3న వీరు ఒడిశాకు తిరిగొచ్చారు.

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య 7 వేల 466కు చేరింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,987 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 266 మంది ప్రాణాలు కోల్పోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.