ETV Bharat / bharat

మహారాష్ట్రలో వరుస భూకంపాలు- ముంబయిలోనూ..

మహారాష్ట్రలో వరుస భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. 24 గంటల్లో మూడు భూకంపాలు సంభవించాయి. శనివారం ఉదయం ముంబయిలో 2.7 తీవ్రతతో భూమి కంపించింది. అంతకుముందు నాసిక్, పాల్​ఘర్​ జిల్లాల్లో భూకంపాలు వచ్చాయి.

Maharashtra
భూకంపాలు
author img

By

Published : Sep 5, 2020, 10:46 AM IST

మహారాష్ట్ర ముంబయిలో ఉదయం 6.36 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. ఉత్తర ముంబయికి 98 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. రిక్టర్​ స్కేల్​ మీద 2.7 తీవ్రత నమోదైంది.

మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో ఇది మూడో భూకంపం. అంతకుముందు పాల్​ఘర్​ జిల్లాలో దహను, తలసారి ప్రాంతంలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు నాసిక్​లో 2.8 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి.

గుజరాత్​లోనూ..

గుజరాత్​ కచ్​లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్​ స్కేల్​ మీద 4.1 తీవ్రత నమోదైంది. భూకంప కేంద్రం 30.5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.

ఇదీ చూడండి: బాణసంచా కర్మాగారంలో పేలుడు- 9 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.