ETV Bharat / bharat

సీఏఏ ఆందోళనలు హింసాత్మకం... నలుగురు పోలీసులకు గాయాలు

తమిళనాడులో సీఏఏ, ఎన్​ఆర్​సీ నిరసనలు హింసాత్మక రూపు దాల్చాయి. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు పోలీసులు గాయపడ్డారని సమాచారం. నిరసనకారులతో పోలీసు ఉన్నతాధికారుల సంప్రదింపుల అనంతరం ఆందోళనలు విరమించారని తెలుస్తోంది.

caa
సీఏఏ ఆందోళనలు హింసాత్మకం... నలుగురు పోలీసులకు గాయాలు
author img

By

Published : Feb 15, 2020, 5:47 AM IST

Updated : Mar 1, 2020, 9:30 AM IST

సీఏఏ ఆందోళనలు హింసాత్మకం... నలుగురు పోలీసులకు గాయాలు

తమిళనాడు చెన్నైలో సీఏఏ, ఎన్ఆర్​సీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. వాషర్​మెన్​పేట్​ వద్ద నిరసనలు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయని సమాచారం. గాయపడిన భద్రతాసిబ్బందిని ఆసుపత్రికి తరలించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. నిరసనకారులతో సంప్రదింపులు జరిపిన పోలీసు ఉన్నతాధికారులు ఆందోళనలను విరమింపజేశారని తెలుస్తోంది .

సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిని బలవంతంగా చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించిన కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. కొంతమందిని నిర్బంధించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిని విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్​ చేశారు. నిరసనకారులతో సంప్రదింపుల అనంతరం తమ అదుపులో ఉన్న వారిని విడుదల చేశారు పోలీసులు. ఉద్రిక్తతలు నెలకొన్న కారణంగా నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇదీ చూడండి: దిల్లీ సీఎంగా ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్

Last Updated : Mar 1, 2020, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.