ETV Bharat / bharat

వందల కిలోమీటర్లు ప్రయాణించిన జవాన్​.. ఎందుకంటే? - jawan latest news

దేశంలో కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ ప్రకటించింది కేంద్రం. దీనివల్ల ప్రజలంతా ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఓ జవాన్​ ఏకంగా వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. ఇందుకోసం వివిధ రకాల రవాణా సాధనాలను ఉపయోగించుకున్నాడు. ఎందుకో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

30year old Chhattisgarh Armed Force (CAF) jawan travelled over 1100 km in three days amid nationwide lockdown
లాక్​డౌన్​లోనూ వందల కిలోమీటర్లు ప్రయాణించిన జవాన్​.. ఎందుకంటే?
author img

By

Published : Apr 13, 2020, 7:26 AM IST

కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా దేశంలో విధించిన 21రోజుల లాక్‌డౌన్‌ సత్ఫలితాలిస్తున్నప్పటికీ కొందరికి మాత్రం చేదు అనుభవాలను మిగులుస్తోంది. తాజాగా ఇలాంటి ఘటన ఛత్తీస్‌గఢ్‌లో ఒకటి, కాన్పూర్​లో మరొకటి జరిగింది.

తల్లి అంత్యక్రియల కోసం 1100 కిలోమీటర్లు..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్​కు చెందిన సంతోష్​ యాదవ్​ అనే 30 ఏళ్ల యువకుడు ఛత్తీస్​గఢ్​లోని బిజాపుర్​ జిల్లాలో పనిచేస్తున్నాడు. ఛత్తీస్​గఢ్​ ఆర్మ్​డ్​ ఫోర్స్(సీఏఎఫ్​)లో విధులు నిర్వర్తిస్తున్న ఈ జవానుకు.. ఈ నెల 4న తన తల్లి మరణించిందనే వార్త తెలిసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఫలితంగా బిజాపుర్​ నుంచి స్వస్థలం మీర్జాపుర్​కు కాలినడకన వెళ్లడానికి సిద్ధమయ్యాడు. దాదాపు 1100 కి.మీ దూరం ఉన్న స్వస్థలానికి బయలుదేరిన అతడికి... దారిలో అక్కడక్కడ వాహనాదారులు లిఫ్ట్‌ ఇచ్చారు. అంతేకాకుండా ఎడ్ల బండి, వ్యాన్ ఆ తర్వాత ఎనిమిది గూడ్స్​ రైళ్లు మారుతూ ప్రయాణం కొనసాగించాడు. ఈ సమయంలో రైల్వే ప్రొటక్షన్​ ఫోర్స్​లో పనిచేసే తన స్నేహితులు బాగా సహాయం చేశారని చెప్పాడు.​ చివరిగా తన ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో నది దాటేందుకు పడవలోనూ ప్రయాణించాడు. దాదాపు మూడు రోజుల ప్రయాణం తర్వాత ఏప్రిల్​ 7 ఉదయానికి తన స్వగ్రామానికి చేరుకున్నాడు.

వృత్తి ధర్మం కోసం నడక...

లాక్​డౌన్​లో పోలీసులు రాత్రి, పగలూ తేడా లేకుండా గస్తీ కాస్తున్నారు. ఇటువంటి సమయంలో వృత్తే ప్రధానమని భావించిన ఓ కానిస్టేబుల్‌.. కాలినడకన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ నుంచి మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చేరుకున్నాడు. కాన్పూర్‌లోని భౌటికి చెందిన ఆనంద్‌ పాండే.. జబల్పూర్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తన భార్య అనారోగ్యంగా ఉందని తెలిసి ఫిబ్రవరి 20న సెలవుపై ఇంటికి వచ్చాడు. లాక్‌డౌన్‌ విధించడం వల్ల అక్కడే చిక్కుకున్నాడు.

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆనంద్‌ పాండే వృత్తి ధర్మాన్ని మర్చిపోలేదు. మార్చి 30న కాలి నడకన కాన్పూర్‌ నుంచి బయలుదేరాడు. మార్గం మధ్యలో కొందరు లిఫ్ట్​ ఇచ్చారు. అలా మూడు రోజులకు జబల్పూర్‌ చేరుకున్నాడు. ఆయనకు వృత్తిపట్ల ఉన్న అంకితభావానికి ఇన్‌స్పెక్టర్ బాఘెల్, మిగిలిన పోలీసులు ప్రశంసించారు. ఇప్పుడు ఆనంద్‌ పాండే జబల్పూర్‌లోని గంటాఘర్‌ చౌక్‌ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఆనంద్‌ పాండే మాత్రమే కాదు.. ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల 22 ఏళ్ల కానిస్టేబుల్‌ దిగ్విజయ్‌ శర్మ 450 కిలోమీటర్లు నడిచాడు. 20 గంటలు నడిచి ఉత్తరప్రదేశ్‌ నుంచి మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ చేరుకుని విధులకు హాజరయ్యాడు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.