ETV Bharat / bharat

30 మునిసిపాలిటీల్లోనే 79% కరోనా కేసులు

దేశంలో కరోనా తీవ్రత కొన్ని ప్రాంతాల్లోనే అధికంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలోని మంత్రుల బృందం.. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితిపై చర్చించింది. వైరస్​ ప్రభావం ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది.

HEALTH-VIRUS-GOM
మంత్రుల బృందం
author img

By

Published : May 15, 2020, 8:11 PM IST

దేశంలోని 30 మునిసిపాలిటీల్లోనే 79 శాతం కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. దేశంలో కరోనా కేసులు 81,970కి చేరుకున్నాయని.. 2,649 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు.

కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి మంత్రుల బృందం 15వ సారి ఇవాళ భేటీ అయింది. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితికి సంబంధించి మంత్రుల బృందానికి నివేదించారు అధికారులు. అవి...

  • ఇప్పటివరకు దేశంలో 27,920 మంది కోలుకున్నారు. గురువారం 1,685 మంది డిశ్చార్జి కాగా 100 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 3,967కు చేరింది. రికవరీ రేటు 34.06 శాతంగా ఉంది.
  • దేశంలో రెట్టింపు రేటుపై లాక్​డౌన్​ ప్రభావం స్పష్టంగా కనిపించింది. లాక్​డౌన్​ ముందు వారంలో 3.4 రోజులు ఉండగా.. గత వారంలో 12.9 రోజులకు మెరుగుపడింది.
  • కరోనా ప్రభావం కొద్ది ప్రాంతాల్లోనే అధికంగా ఉంది. 79 శాతం కేసులు 30 మునిసిపాలిటీల్లోనే నమోదయ్యాయి.

ఆసుపత్రులు, ఇతర సదుపాయాలు

  • దేశవ్యాప్తంగా 8,694 సదుపాయాల్లోని 2,77,429 పడకలను కరోనా బాధితులను చికిత్స కోసం వినియోగిస్తున్నారు. ఇందులో 919 ప్రత్యేక కరోనా ఆసుపత్రులు కాగా, 2,036 ఆరోగ్య కేంద్రాలు, 5,739 కేర్ సెంటర్లు ఉన్నాయి.
  • ఈ కేంద్రాల్లో 29,701 ఇంటెన్సివ్​ కేర్, 5.15 లక్షల ఐసొలేషన్ పడకలు ఉన్నాయి. 18,855 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి.
  • వ్యక్తిగత సంరక్షణ పరికరాల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 3 లక్షల యూనిట్లకు చేరింది. ఎన్​-95 మాస్కులు దేశ అవసరాలకు సరిపడా ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రాలకు 84.22 లక్షల మాస్కులు, 47.98 లక్షల పీపీఈ కిట్లను కేంద్రం సరఫరా చేసింది.

నిర్ధరణ పరీక్షలు..

  • దేశంలోని 509 ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబుల ద్వారా రోజుకు లక్ష మంది పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 20 లక్షల పరీక్షలు నిర్వహించారు.
  • జాతీయ వ్యాధి నివారణ కేంద్రం (ఎన్​సీడీసీ)లో కరోనా నిర్ధరణ కోసం 'కోబాస్​ 6800 ఆర్​టీ-పీసీఆర్' ఉన్నత స్థాయి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీని సాయంతో 24 గంటల్లో 1,200 శాంపిళ్లను పరీక్షిస్తుంది.
  • ప్రస్తుతానికి దేశానికి సరిపడా టెస్టు కిట్లు ఉన్నాయి. వీటిని ఐసీఎంఆర్​కు చెందిన 15 డిపోల ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు.

కట్టడిపై చర్చ..

కరోనాను కట్టడి చేసేందుకు దేశం అనుసరిస్తున్న వ్యూహంపై మంత్రుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. వైరస్​ తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించింది. సత్వర చికిత్సతోపాటు మరణాల రేటు తగ్గేలా కాంటాక్ట్ ట్రేసింగ్​ను విస్తృతంగా చేపట్టే విధంగా ముందుకెళ్లాలని తీర్మానించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.